Antharboadh Educational Society

అంతర్బోధి



లక్ష్యం

నాణ్యమైన విద్య గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలకు అందించాలి.

అనుసరించే పద్ధతులు

  1. చదివే సామర్థ్యాలను సమృద్దిగా అందించాలి.
  2. తేలికగా గుర్తుపట్టి చదవటం వచ్చే వరకు పిల్లలకు అక్షరాలు నేర్పించాలి, నేర్పించే ప్రక్రియ పిల్లలకు సృజనాత్మకంగా ఉండాలి, వారికి అక్షరాలు నేర్చుకోవటానికి కావాలిసిన సమయం ఇవ్వాలి. తద్వారా పిల్లలకు చదివే ప్రక్రియను సులభసాధ్యం చేయాలి.
  3. విద్యార్థి గుర్తు పట్టలేని అక్షరాలు తెలుసుకుని, ఆ అక్షరాలను నేర్పించాలి. మూస పద్దతిలో అక్షరాలను ఒక వరుసలో రోజూ వ్రాసినంత మాత్రాన అక్షరాలు వచ్చి నట్లు నిర్థారించలేము.
  4. పిల్లల చే పాఠ్యంశాలను కాకుండ ప్రథమంగా కథల పుస్తకాలు చదవటానికి కావాలిసిన నైపుణ్యం ఇచ్చి సహాయం చేయాలి. పిల్లలు ఇష్టపడే వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు వారికి అందుబాటులో ఉంచాలి.
  5. పిల్లలలో కనీస సామర్థ్యలను అందించటం వలన వారు నేర్చుకోవాలనుకునే అంశాలను స్వయంగా నేర్చుకోవటానికి పునాది వేయాలి.
  6. పిల్లలే స్వయంగా చదివే పనిని, నేర్చుకునే పనిని, బ్రతుకుదెరువుకు చేయాల్సిన పనిని నిర్థేశించుకోవడం, ప్రణాళిక వ్రాసుకోవటం, ప్రణాళిక అనుసరించి పని చేసుకోవటం, తమ సామర్థ్యాలను తామే అంచనా వేసుకోవటం అలవాటు చేయాలి. బడికి వెళ్తేనే చదవటం, టీచరు పని ఇస్తేనే చేయాటం కాకుండా చదవటం దైనందిన కార్యక్రమము కావాలి. ఎవరో పని ఇస్తారు అనే ఆలోచనా విధానం పిల్లలకి కలుగకుండా చేయాలి.
  7. బోధించడం, ఆలోచించడం, చర్చించడం, ప్రశ్నించడం, సంభాషించడాన్ని, ఉపన్యసించడాన్ని ప్రోత్సహించటం ద్వారా విషయాలను అర్థం చేసుకునేలా చేయాలి.

మరో బడి ఎందుకు?

మనిషి ఇతర గ్రహాలకు చేరుకున్నాడు , కాని భూమి మీద ప్రక్కనే ఉన్న మనిషికి అక్షరం అందించలేక పోతున్నాడు. భూమ్మీద అఖరి మనిషి వరకూ అక్షరం చేరాలి.

మనిషి నైపుణ్యం కలిగిన ఎన్నో పనులు (ఉదాహరణకి: వ్యవసాయం, వడ్రంగిపని) బడి లేకుండానే నేర్చుకో గలుగుతున్నా , చదవటం మాత్రమే నేర్చుకోవటానికి 1 0 - 20 సంవత్సరాలు బడికి వెళ్లినా అక్షరాలు చదవలేక పోతున్నారు, సొంతంగా పని నిర్థేశించుకునే సహజ జ్ణానం కోల్పోతున్నారు. చదువు అవసరం తెలిసే వాతావరణం కలిగించటం ద్వారా చదవటం, నేర్చుకోవటం, పని చేయటం అలవాటు చేయాలి.

అక్షరాలు(చదవటం) మాత్రమే నేర్ప గలిగితే, పిల్లలు దేనినైనా నేర్చుకోగలరు. దానికి బదులు బడికి, కాలేజీకి వెళ్లినంత కాలం ఇంకో మనిషి పుస్తకం చదివి తిరిగి దానినే చెప్పటమేమిటి? ఈ తరం బడులు నేర్చుకోవాటాన్ని నేర్పించాలి

అన్నింటికీ మించి సహజంగా నే నేర్చుకోగల జ్ణానం ఉన్న మనిషికి చదువు తోడు కావాలి
అంతే కాని చదువు పేరుతో మనిషి సహజత్వాన్ని చంపేయకూడదు.